పాపం పవన్ కల్యాణ్ సపోర్ట్ చేస్తేనే తమకు ప్లస్ అవుతుందని, నెక్స్ట్ ఎన్నికల్లో జగన్‌కు చెక్ పెట్టడానికి ఛాన్స్ దొరుకుతుందనేది టీడీపీ నేతలకు, కార్యకర్తలకు బాగా అర్ధమైందనే చెప్పాలి. ఎందుకంటే గత ఎన్నికల్లో జగన్ దెబ్బ తర్వాత ఏపీలో టీడీపీ కోలుకోవడం కష్టమైపోయింది..కొద్దో గొప్పో కొంతవరకు టీడీపీ పుంజుకుంది గాని..పూర్తి స్థాయిలో వైసీపీకి చెక్ పెట్టే విధంగా మాత్రం టీడీపీ పికప్ కాలేదు. అందుకే పవన్ కల్యాణ్ సపోర్ట్ చేస్తే..కాస్త వైసీపీకి చెక్ పెట్టొచ్చనేది తెలుగు తమ్ముళ్ళ ఆలోచన.
తెలుగు తమ్ముళ్లే కాదు…చంద్రబాబు ఆలోచన కూడా అదే..అందుకే పవన్‌తో పొత్తు పెట్టుకోవడం కోసం తెగ ప్రయత్నిస్తున్నారు. పైగా పవన్ కల్యాణ్ విడిగా పోటీ చేస్తే ఓట్లు చీలిపోయి టీడీపీకే బొక్క పడుతుంది..ఆ విషయం కూడా బాబుకు బాగా తెలుసు. అందుకే పవన్‌ని ఎలాగైనా దగ్గర చేసుకోవాలని టీడీపీ ప్రయత్నిస్తుంది. ఇక అవసరం లేకున్నా సరే పవన్ కల్యాణ్‌కు టీడీపీ సపోర్ట్ ఇచ్చేస్తుంది. అలాగే వైసీపీ నేతలు ఏమన్నా…పవన్‌పై విమర్శలు చేస్తే చాలు జనసైనికులు కంటే ముందు తమ్ముళ్ళు ఊరుకోవడం లేదు..వెంటనే వైసీపీపై ఫైర్ అవుతున్నారు.
ఇక తాజాగా పవన్ కల్యాణ్ బీమ్లానాయక్ సినిమా విషయంలో జగన్ ప్రభుత్వం కాస్త నిర్బంధాలతో ముందుకెళుతున్న విషయం తెలిసిందే. ఎక్కువ షోలకు పర్మిషన్ ఇవ్వకపోవడం, టిక్కెట్ల రేట్లు పెంచకపోవడం లాంటివి చేసింది…దీంతో పవన్ ఫ్యాన్స్…జగన్ ప్రభుత్వంపై ఫైర్ అవుతున్నారు.
ఇదే సమయంలో టీడీపీ నేతలు, కార్యకర్తలు సైతం పవన్‌కు మద్ధతుగా నిలుస్తూ…జగన్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తున్నారు…అసలు పవన్ కల్యాణ్ సినిమాని ఏమి చేయలేరంటూ మాట్లాడుతున్నారు. ఆఖరికి సీనియర్ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి లాంటి వారు కూడా పవన్ సినిమాకు సపోర్ట్‌గా నిలిచారంటే పరిస్తితి ఎలా ఉందో అర్ధం చేసుకోవచ్చు. అంటే పవన్‌ని దగ్గర చేసుకోవడం కోసం తమ్ముళ్ళు తెగ ఆరాటపడుతున్నారు. మరి తమ్ముళ్ళ ఆరాటం చూసి పవన్, టీడీపీకి దగ్గరవుతారేమో చూడాలి.