ఆంధ్రప్రదేశ్ లో అవినీతి విషయంలో విపక్ష పార్టీలు అధికార పార్టీని ఇబ్బంది పెట్టే విధంగా విమర్శలు చేస్తున్నాయి. ఏ చిన్న అవినీతి వ్యవహారం బయటకు వచ్చినా సరే టార్గెట్ చేస్తూ విమర్శలు చేస్తున్నారు. తాజాగా ఒక వ్యవహారం వెలుగులోకి వచ్చింది. గ్రామ సచివాలయాల్లో ఇచ్చిన కాంట్రాక్ట్ లను టార్గెట్ చేస్తూ విమర్శలు చేస్తుంది తెలుగుదేశం పార్టీ.
సచివాలయాలకు స్టేషనరీ సరఫరాలో కోట్ల స్వాహా అని టీడీపీ సీనియర్ నేత దేవినేని ఉమా ఆరోపించారు. రూ.1000 వస్తువులకు కాంట్రాక్టర్లకు 3000 చెల్లింపు అని మండిపడ్డారు. తక్కువ మెటీరియల్ సరఫరా, ప్రింటర్ కు ఇంకు, దరఖాస్తుకు కాగితాలు లేవంటూ దరఖాస్తుదారుల నుండి డబ్బు వసూలు అని ఆయన ఆగ్రహం వ్యక్తం చేసారు. కాంట్రాక్టు సంస్థ ఎవరిదో.. డబుల్ దోపిడీ బాగోతంపై ప్రజలకు సమాధానం చెప్పండి వైఎస్ జగన్ గారూ అని నిలదీశారు.