ఢిల్లీ బాట పట్టిన టీ బీజేపీ ఎంపీలు.. కారణమేంటంటే..?

-

బీజేపీ ఎంపీలు ఢిల్లీకి బయలుదేరుతున్నారు. పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు సోమవారం నుంచి ప్రారంభం కానున్న నేపథ్యంలో ఇప్పటికే పలువురు ఢిల్లీకి చేరుకున్నారు.సోమవారం పార్లమెంట్‌లో ప్రమాణ స్వీకార కార్యక్రమం ఉండటంతో ఒక్కొక్కరుగా హస్తిన బాట పట్టారు.కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ హైదరాబాద్‌లో పర్యటన అనంతరం ఢిల్లీకి వెళ్లారు. అలాగే పాలమూరు ఎంపీ డీకే అరుణ,మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ ఆదివారం బయలుదేరి ఢిల్లీకి చేరుకున్నారు. ఇతర మిగతా ఎంపీలు ఒక్కొక్కరుగా హస్తిన బాట పడుతున్నారు.

కాగా, కేంద్రంలో మూడోసారి ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలో ఎన్డీఏ సర్కార్ అధికారము చేపట్టిన తరువాత తొలిసారి పార్లమెంటు సమావేశాలు రేపు(జూన్ 24) ఉదయం 11 గంటలకు ప్రారంభం కానున్నాయి.తొలిరోజే దాదాపు 280 మంది ఎంపీలు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. మిగతా 264 మంది ఎంపీలు రెండో రోజు ప్రమాణం చేస్తారు. ఒక్క ఎంపీ ప్రమాణ స్వీకారానికి దాదాపు నిమిషం పడుతుంది.

Read more RELATED
Recommended to you

Latest news