తెలంగాణ రాష్ట్ర ఉద్యోగులకు, ఉపాధ్యాయులకు కేసీఆర్ సర్కార్ శుభవార్త చెప్పింది. తెలంగాణ రాష్ట్రంలో ఉద్యోగ, ఉపాధ్యాయుల పరస్పర బదిలీల ప్రక్రియ ఇవాల్టి నుంచి ప్రారంభం కానుంది. ఇందుకు దరఖాస్తులను ఐ ఎఫ్ ఎం ఐ ఎస్ పోర్టల్ ద్వారా ఆన్ లైన్ లో స్వీకరించనున్నారు.
దీనిపై ఈ నెల 15వ తేదీ వరకు గడువు విధించారు. పరస్పర బదిలీ ప్రక్రియ లో ఒక ఉద్యోగి ఒక్కరికే కన్సెంట్ ఇచ్చే అవకాశం కల్పించారు. ఉద్యోగులు అలాగే ఉద్యోగ సంఘాల విజ్ఞప్తి మేరకు మ్యూచువల్ ట్రాన్స్ఫర్ లకు అంగీకరించిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఫిబ్రవరి 2వ తేదీన ఈ మేరకు జీవో జారీ చేసిన సంగతి తెలిసిందే.
ఉద్యోగుల విజ్ఞప్తి మేరకు ఉమ్మడి జిల్లా పరిధిలో పరస్పర బదిలీ కోరుకున్న వారికి సీనియారిటీలో రక్షణ కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నేపథ్యంలోనే దరఖాస్తుల సంఖ్య పెరిగే అవకాశం ఉంటుందని అధికారులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.