ఛాంపియన్స్ ట్రోపీలో భాగంగా భారత్ వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ దుబాయ్ వేదికగా జరుగుతోంది. తొలుత పాకిస్తాన్ జట్టు అద్భుతమైన ఫామ్ కొనసాగించింది. తొలుత భారత బౌలర్ హార్దిక్ పాండ్య బాబర్ ని ఔట్ చేశాడు. అద్భుతమైన బౌలింగ్ వేశారు హార్దిక్. ఆ తరువాత వెంటనే కుల్దీప్ యాదవ్ వేసిన బంతికి మరో ఓపెనన్ ఇమామ్ ని అక్షర్ పటేల్ రన్ ఔట్ చేశాడు. ఇది మ్యాచ్ కే హైలెట్ అని చెప్పవచ్చు.
దీంతో పాకిస్తాన్ ఓపెనర్లు బాబర్, ఇమామ్ పెవీలియన్ కి చేరారు. కెప్టెన్ రిజ్వాన్ ని పెవీలియన్ కి పంపితే పాక్ కష్టాల్లో పడినట్టు అవుతుందని టీమిండియా అభిమానులు పేర్కొంటున్నారు. ఈ మ్యాచ్ చాలా రసవత్తరంగా మారింది. 10 ఓవర్లలో పాకిస్తాన్ జట్టు 52 పరుగులు చేసి 2 వికెట్లు కోల్పోయింది.