ఒమిక్రాన్‌ ఎఫెక్ట్ : చార్టర్‌ ఫ్లైట్‌లో దక్షిణాఫ్రికాకు టీమిండియా

ప్రస్తుతం ఒమిక్రాన్ వేరియంట్ ప్రపంచ దేశాలను వణికిస్తోంది. ఇప్పటికే… ఈ వైరస్ 70 దేశాలకు పైగా పాకింది. మనదేశంలోనూ.. ఈ వైరస్ క్రమక్రమంగా వ్యాపిస్తోంది. మొట్టమొదటిగా దక్షిణాఫ్రికా దేశంలో పురుడు పోసుకున్న ఈ కొత్త వేరియంట్… ప్రపంచ దేశాల వ్యాపించి… మరో ముప్పు నకు దారి తీస్తోంది.

ఇలాంటి తరుణంలో దక్షిణాఫ్రికా టూర్ కోసం టీమిండియా ఇవాళ బయలుదేరింది. విరాట్ కోహ్లీ సారథ్యంలోని టెస్ట్ జట్టు ప్రోటిస్ తో తలపడేందుకు ఇవాళ ఉదయం సౌత్ ఆఫ్రికాకు వెళ్ళింది టీమ్ ఇండియా. కరోనా కొత్త వేరియంట్ వ్యాప్తి భయల నేపథ్యంలో బిసిసిఐ అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ.. టీమిండియా ఆటగాళ్లను ప్రత్యేక చాప్టర్ ఫ్లైట్ లో దక్షిణాఫ్రికాకు పంపింది. కాగా ఇప్పటి వరకు  ప్ర‌పంచ‌ వ్యాప్తంగా 20 వేలు దా టాయి  ఒమిక్రాన్ వేరియంట్  కేసులు నమోదు అయ్యాయి. యూ కే లో 10 వేల ఒమిక్రాన్ వేరి యంట్  కేసులు నమోదు అయ్యాయి. . భార‌త్‌లో 68 కి చేరాయి  ఒమిక్రాన్ కేసులు.