కరేబియన్ దీవుల్లో ఘోర విమాన ప్రమాదం..9 మంది దుర్మరణం

కరేబియన్ దీవుల్లో ఘోర విమాన ప్రమాదం జరిగింది. కరేబియన్ దీవుల్లోని డొమినికన్ రిపబ్లిక్ దేశంలో జెట్ విమానం కుప్పకూలింది. ఈ ప్రమాదంలో 9 మంది దుర్మరణం పాలయ్యారు. డొమినికన్ రిపబ్లిక్ లోని లా ఇసబెల్లా అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి బయలు దేరిన కొద్ది సేపటికే ప్రమాదం చోటు చేసుకుంది. జెట్ టేకాఫ్ అయిన 15 విమాన ప్రమాదం జరిగింది. ఈ విమాన ప్రమాదంలో ఇద్దరు సిబ్బందితో పాటు 7 గురు ప్రయాణికులు మరణించారు. ప్రైవేటు విమానం డొమినికన్‌లోని లా ఇసబెల్లా అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ఫ్లోరిడా వెళ్తున్నది.

విమానం టేకాఫ్ అయిన కొద్ది సేపటికే సాంకేతిక సమస్య తలెత్తడంతో రాజధాని శాంటో డోమింగోలో ఉన్న లాస్ అమెరికాస్ ఎయిర్ పోర్టులో అత్యవసరంగా ల్యాండ్ అయ్యే సమయంలో ప్రమాదం చోటుచేసుకుంది. ల్యాండ్ అవుతున్న క్రమంలో ఒక్కసారిగా జెట్ పేలిపోయింది. మరణించిన వారిలో ఆరుగురు విదేశీయులు ఉన్నారు. అయితే వారు ఏ దేశానికి చెందిన వారనే విషయంపై స్పష్టనివ్వలేదని స్థానిక మీడియా వెల్లడించింది.