చాలా మంది ఎదుర్కొనే సమస్యల్లో దంతాల సమస్య కూడా ఒకటి. దంత సమస్యలు లేకుండా దంతాలు ఆరోగ్యంగా ఉండాలంటే ప్రతి రోజు తప్పకుండా వీటిని అనుసరించండి అప్పుడు దంతల సమస్యలు ఏమీ కలగవు. ఆరోగ్యంపై ఎలా శ్రద్ధ పెడతామో దంతాల ఆరోగ్యంపై కూడా అదే విధంగా శ్రద్ధ పెట్టాలి.
సరైన జాగ్రత్తలు తీసుకుంటే నోటికి ఎటువంటి ఇన్ఫెక్షన్స్ రాకుండా జాగ్రత్తగా ఉండొచ్చు. నిజానికి మౌత్ ఇన్ఫెక్షన్స్ కలిగితే వెంటనే సరైన ట్రీట్మెంట్ తీసుకోవాలి అప్పుడు ఇన్ఫెక్షన్స్ నుండి బయటపడడానికి అవుతుంది. జనాభాలో 50 శాతం మందికి దంతాల సమస్యతో బాధపడుతూ ఉంటారు అందుకనే దంతాలపై శ్రద్ధ పెట్టడం ముఖ్యం.
ధూమపానం మానేయండి:
ధూమపానం వల్ల పళ్ళు కూడా దెబ్బతింటాయి. పొగాకులో ఉండే నికోటిన్ గమ్స్ కి బ్లడ్ సప్లై చేయదు దంతాలు ఆరోగ్యంగా ఉండాలంటే పొగాకుకు దూరంగా ఉండాల్సిందే.
రెగ్యులర్ గా డెంటల్ చెకప్స్ కి వెళ్లడం:
సమస్య ఉన్నా లేకపోయినా రెగ్యులర్ గా చెక్ అప్ కి వెళ్లడం మంచిది దీనివల్ల ఇబ్బంది రాదు.
మౌత్ వాష్ ను ఉపయోగించండి:
మనం ఎన్నో ఆహార పదార్థాలను తీసుకుంటూ ఉంటాము అందుకనే సరైన సంరక్షణ కూడా ఉండాలి మౌత్ వాష్ ను ఉపయోగించడం వల్ల బ్యాక్టీరియా వంటివి తొలగిపోతాయి.
సరైన విధంగా బ్రష్ చేయడం:
మీరు ఎంచుకునే టూత్ బ్రష్ యొక్క బ్రిస్టల్స్ సాఫ్ట్ గా ఉండాలి మరియు స్ట్రైట్ గా ఉండాలి పాత బ్రష్ ని ఉపయోగించకూడదు. బ్రష్ పాతదైతే దానికి బదులుగా కొత్త బ్రష్ తీసుకోవాలి ఇలాంటి చిన్న చిన్న వాటిని సరిచేసుకుంటే దంతాల ఆరోగ్యం బాగుంటుంది.