తొమ్మిదోసారి బీహార్ సీఎంగా నితీశ్ కుమాార్ ప్రమాణం

-

బిహార్‌లో గత కొన్ని రోజులుగా కొనసాగుతున్న రాజకీయ ఉత్కంఠకు తెర పడింది. ఎట్టకేలకు బీజేపీ మద్దతుతో తిరిగి ఎన్డీయేలోకి చేరిన నితీశ్ కుమార్  9వ సారి సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు. లాలూ ప్రసాద్ యాదవ్‌కు చెందిన రాష్ట్రీయ జనతాదళ్ (ఆర్‌జేడీ), కాంగ్రెస్‌తో 18 నెలల పాలనకు ముగింపు పలికిన బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ ఆదివారం తన పదవికి రాజీనామా చేశారు.

దీంతో ఆయన మహాఘటబంధన్ కూటమి నుంచి వైదొలగి బీజేపీలో చేరారు. దీంతో ఆర్జేడీతో జేడీయూ బంధం తెగిపోయింది. అంతకు ముందు రాజ్‌భవన్‌లో గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్‌కు లేఖ సమర్పించిన తర్వాత నితీష్ బీహార్ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు.నితీష్ కుమార్ కుమార్ తో పాటు ఇద్దరూ బీజేపీ నేతలు సామ్రాట్ చౌదరి, విజయ్ సిన్హా కూడా పాట్నాలోని రాజ్ భవన్ లో డిప్యూటీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు. జేడీయూ, బీజేపీలకు చెందిన ముగ్గురు మంత్రులు, జితన్ రామ్ మాంఝీకి చెందిన హిందూస్థాని అవామ్ మోర్చా నుంచి ఒకరు. స్వతంత్ర ఎమ్మెల్యే ఒకరు మంత్రులుగా ప్రమాణం చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news