Telangana : పండగ వేల ప్రయాణికులకు టిఎస్ఆర్టిసి మరో గుడ్ న్యూస్…..

-

సంక్రాంతి పండుగకి సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికులకు టీఎస్‌ఆర్టీసీ శుభవార్త చెప్పింది. 4,844 ప్రత్యేక బస్సులను నడపాలని అందులో 625 సర్వీసులకు ముందస్తు రిజర్వేషన్‌ సౌకర్యం కల్పించింది. ఈ జనవరి 7 వ తేదీ నుంచి 15 వ తేదీ వరకు ఈ ప్రత్యేక బస్సులు నడుపుతామని ఎండి సజ్జన ప్రకటించారు. సంక్రాంతికి మహాలక్ష్మి పథకం అమలు, ప్రత్యేక బస్సుల ఏర్పాటు ప్రయాణికులకు కల్పించాల్సిన సౌకర్యాలపై సజ్జనార్ సమావేశం నిర్వహించారు.

సజ్జనార్‌ మాట్లాడుతూ.. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అమలు నేపథ్యంలో ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా సంక్రాంతికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. హైదరాబాద్‌లో రద్దీ ప్రాంతాలైన ఉప్పల్‌ క్రాస్‌ రోడ్స్‌,ఎంజీబీఎస్‌,జేబీఎస్‌,గచ్చిబౌలి,కేపీహెచ్‌బీ,ఆరాంఘర్‌, ఎల్బీనగర్‌ క్రాస్‌ రోడ్స్‌, బోయిన్‌పల్లి, తదితర ప్రాంతాల్లో స్పెషల్ బస్సులను నడుపుతున్నామని చెప్పారు. ఆయా ప్రాంతాల్లో ప్రయాణికుల సౌకర్యార్థం పండల్స్, పబ్లిక్ అడ్రస్ సిస్టం,కుర్చీలు,షామియానాలు, తాగునీటి సదుపాయం, మొబైల్ టాయిలెట్లను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. ప్రతి రద్దీ ప్రాంతం వద్ద ఇద్దరూ డీవీఎం ర్యాంక్ అధికారులను ఇన్‌ఛార్జులుగా నియమించామని సజ్జనర్ తెలిపారు. ఈ సంక్రాంతికి ఏపీలోని వివిధ ప్రాంతాలకు ప్రత్యేక బస్సులను TSRTC నడుపుతోందని, ఏపీకి షెడ్యూల్ సర్వీసులు ఎప్పటిలాగే నడుస్తాయని స్పష్టం చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news