పలు కీలక బిల్లును అమోదం కోసం రెండురోజుల ప్రత్యేక తెలంగాణ శాసనసభ సమావేశాలు ప్రారంభమయ్యాయి..కేవలం చట్టసవరణ కోసం ఉద్దేశించిన సమావేశాలుకావడంతో ప్రశ్నోత్తరాలను రద్దు చేశారు. జీహెచ్‌ఎంసీ సహా నాలుగు చట్టాల సవరణ కోసం బిల్లులను సభలో ఆయా శాఖల మంత్రులు ప్రవేశపెట్టారు..
శాసనసభలో జీహెచ్ఎంసీ సవరణ బిల్లు ప్రవేశపెట్టి చర్చ ప్రారంభించారు..రాష్ర్ట రాజధాని హైదరాబాద్ నగరానికి ఎంతో గొప్ప చరిత్ర ఉందని, సీఎం కేసీఆర్ నేతృత్వంలో ఇవాళ ఒక మహానగరంగా, విశ్వనగరంగా ఎదగడానికి శరవేగంగా అభివృద్ధి చెందుతూ ముందుకెళ్తుంది అని మంత్రి కేటీఆర్ తెలిపారు.
హైదరాబాద్ మహానగరానికి గొప్ప చరిత్ర ఉందని, 429 సంవత్సరాల కిందటే నిర్మాణానికి బీజం పడింది. 1869లో హైదరాబాద్ మున్సిపాలిటీగా, 1933లో చాదర్‌ఘాట్ అనే మరో మున్సిపాలిటీ, 1937 జూబ్లీహిల్స్ మున్సిపాలిటీ, 1945లో సికింద్రాబాద్ అనే మున్సిపాలిటీ ఏర్పడిందని, హైదరాబాద్‌ను విశ్వనగరంగా తీర్చిదిద్దేందుకు గత ప్రభుత్వాలు సంకల్పించలేదన్నారు కేటీఆర్..
2015లో ఒక జీవో ద్వారా కార్పొరేషన్ ఎన్నికలు జరిగినప్పుడు 50 శాతం స్థానాలను మహిళలకే ఆమోదించుకున్నాం. మహిళా సాధికారతకు పెద్దపీట వేయాలనే ఆలోచనతో మహిళా రిజర్వేషన్లకు ఇవాళ చట్టం చేసుకుంటున్నామని తెలిపారు.