రేపే తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు.. నిరుద్యోగ భృతిపై యువత ఆశలు

-

రేపటినుండి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. గత ఏడాది సాంకేతిక కారణాలతో గవర్నర్ ప్రసంగం లేకుండానే అసెంబ్లీ సమావేశాలు జరిగాయి. అయితే ఈ సారి కెసిఆర్ సర్కార్ కు గవర్నర్ కు మధ్య కుదిరిన సయోధ్యతో బడ్జెట్ కు గవర్నర్ ఆమోదం తెలపడం, మంత్రులు తమిళిసై ని ఆహ్వానించడం జరిగిపోయాయి.

ఈ నేపథ్యంలో అసెంబ్లీలో తెలంగాణ ప్రభుత్వం 2023 – 24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన వార్షిక బడ్జెట్ ను ప్రవేశపెడుతోంది. ఏడాదిలో రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న దృశ్య బడ్జెట్ కేటాయింపులు ఎలా ఉంటాయనే దానిపై జోరుగా చర్చ నడుస్తుంది. రేపు మధ్యాహ్నం 12:10 గంటలకు అసెంబ్లీ సెషన్ మొదలుకానున్నట్లు నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. ఈ సమావేశంలో తొలిరోజే ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగించనున్నారు. ఆ తర్వాత అసెంబ్లీ కౌన్సిల్, బీఏసీ సమావేశాలు నిర్వహించి సెషన్ లపై నిర్ణయం తీసుకోనున్నారు.

ఈసారి దాదాపు 3 లక్షల కోట్లతో తెలంగాణ బడ్జెట్ ఉండే అవకాశం ఉందని తెలుస్తోంది. అయితే యువకుల ఓట్లను దక్కించుకునేందుకు నిరుద్యోగ భృతి ప్రకటిస్తారేమోనని భావన వ్యక్తం అవుతుంది. ఈ బడ్జెట్ లో నైనా నిరుద్యోగ భృతి ప్రకటిస్తారని చాలామంది నిరుద్యోగులు ఆశలు పెట్టుకున్నారు. ఇక మరి కొంతమంది మాత్రం గత నాలుగేళ్లుగా నిరుద్యోగ భృతి ఇస్తామంటూ కాలయాపన చేస్తున్న ప్రభుత్వం.. ఈసారి కూడా అదే ధోరణి అవలంబించే అవకాశం ఉందని అంటున్నారు. ఈ బడ్జెట్ లోనైనా ప్రభుత్వం నిరుద్యోగ భృతిని ప్రకటిస్తుందో లేదో వేచి చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news