తెలంగాణ రాష్ట్ర శాసనసభ ఈ సమావేశాలు ఈ నెల 15వ తేదీ వరకు నిర్వహించాలని శాసనసభ వ్యవహారాల సలహా సంఘం {బీఏసీ} నిర్ణయం తీసుకుంది. శాసన సభ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ఈ నిర్ణయాన్ని తీసుకున్నారు. బీఏసీ నిర్ణయం ప్రకారం ఏడు రోజుల పాటు శాసనసభ సమావేశాలు కొనసాగనున్నాయి.
9వ తేదీన బడ్జెట్ పై సాధారణ చర్చ చేపట్టనున్నారు. 10, 11, 12, 14 తేదీల్లో పద్దుల పై చర్చించనున్నారు. ఇక 15వ తేదీన ద్రవ్య వినిమయ బిల్లు పై శాసనసభ సభ్యులు చర్చించనున్నారు. 8, 13 వ తేదీల్లో సభకు సెలవు ప్రకటించనున్నారు. ఇక ఈ బిఎసి సమావేశానికి తెలంగాణ మంత్రులు హరీష్ రావు, ప్రశాంత్ రెడ్డి, కొప్పుల ఈశ్వర్, గంగుల కమలాకర్, కాంగ్రెస్ ఎమ్మెల్యే భట్టి విక్రమార్క, ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ హాజరయ్యారు.