ఇరవై జిల్లాల ప్రజా ప్రతినిధులతో కేసీఆర్ భేటి ముగిసింది. ఈ సమావేశంలో సీఎం కేసీఆర్ మాట్లాడుతూ జీహెచ్ఎంసీ ,దుబ్బాక లో సర్వేలు పార్టీకి అనుకూలంగా ఉన్నాయని, అలా అని అలసత్వం ప్రదర్శించకుండా గెలుపు కోసం అందరూ కలసి పనిచేయండని కోరారు. నూతన రెవెన్యూ ,మున్సిపల్ చట్టం ప్రజల కోసమేనన్న ఆయన ప్రజల్లో బయన్దోళనలు ఉంటే తొలగించండని కోరారు. Lrs పై ప్రజల అభిప్రాయంను ఎమ్మెల్యేలను అడిగి తెలుసుకున్నారు సీ ఎం కేసీఆర్. ఈ సందర్భంగా ప్రజలు సంతృప్తిగా ఉన్నారని ఎమ్మెల్యేలు సీఎంకు తెలిపారు.
రెండు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ సీట్లు మనమే గెలుస్తామన్న కేసీఅర్ ఓటరు నమోదు పై దృష్టి పెట్టండని కోరారు. కొత్త రెవెన్యూ చట్టంపై ఎమ్మెల్యే లకు ఉన్న పలు సందేహాలను నివృత్తి చేసిన కేసీఆర్ రెవెన్యూ చట్టాన్ని బాగా ప్రచారం చేసుకోవాలని అన్నారు. రెండు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ లు మనమే గెలుస్తున్నామన్న ఆయన జిహెచ్ఎంసీ లో 104 సీట్లు మనవేనని అన్నారు. కొత్తగా గెలిచిన ఎమ్మెల్యేలకు త్వరలో ఓరియెంటెషన్ క్లాస్ నిర్వహిస్తామన్న కేసీఆర్, కొత్తగా ఎన్నికయిన ఎమ్మెల్యేలు ఎలా నడుచుకోవాలో సీఎం కేసీఆర్ సలహాలు కూడా ఇచ్చారు. ఇక త్వరలో రెండు రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు ఉంటాయని కెసీఆర్ పేర్కొన్నారు.