అసలు తెలంగాణా బీజేపీ వాళ్ళు మాట్లాడిన ఈ మాట కి అర్ధం పర్ధం ఉందా ?

-

దేశంలో మత రాజకీయాలు చేయడంలో బిజెపి పార్టీకి మించిన మరొక రాజకీయ పార్టీ లేదని చాలామంది రాజకీయ నేతలు అంటుంటారు. ఈ విధంగానే తాజాగా తెలంగాణ రాష్ట్రంలో మేడారం జాతర జరుగుతున్న సందర్భంలో తెలంగాణ బిజెపి వాళ్లు మాట్లాడిన మాటలు అర్థం పర్ధం లేనట్టుగా మాటలు ఉన్నాయి. మేటర్ లోకి వెళితే ఇటీవల తెలంగాణ రాష్ట్రంలో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో టిఆర్ఎస్ పార్టీ అదిరిపోయే మెజార్టీ స్థానాలు గెలవడం జరిగింది.

Image result for telangana bjp

ఈ సందర్భంగా ప్రగతి భవన్ లో మీడియా ఈ సమావేశంలో కేసీఆర్ మాట్లాడుతూ దేశంలో తన కంటే గొప్ప హిందువు మరొకరు లేరని అయినా గాని సెక్యులర్ భావాలతో రాజకీయాలు చేయాలని టిఆర్ఎస్ పార్టీ సెక్యులర్ పార్టీ అని స్పీచ్ ఇవ్వడం జరిగింది. అయితే ప్రస్తుతం మేడారం జాతర సందర్భంగా తెలంగాణ బిజెపి పార్టీ అధ్యక్షుడు లక్ష్మణ్ మాట్లాడుతూ… గొప్ప హిందువుని అని చెప్పుకునే కేసీఆర్, అయోధ్య‌లో రామమందిరం నిర్మాణానికి సిద్ధ‌మౌతుంటే ఆయ‌న ఎందుకు స్పందించ‌లేద‌ని ప్ర‌శ్నించారు.

ఆయ‌న పైకి హిందువుగా న‌టిస్తున్నార‌న్నారు. మేడారం జాత‌ర‌ను జాతీయ పండుగ‌గా ప్ర‌క‌టించాలంటే… రాష్ట్రంలో త‌మ‌కు అధికారం ప్ర‌జ‌లు ఇవ్వాల‌న్నారు. దీంతో తెలంగాణ బీజేపీ లక్ష్మణ్ చేసిన వ్యాఖ్యల పట్ల తెలంగాణ ప్రజలు తీవ్ర స్థాయిలో సీరియస్ అవుతున్నారు. జాతర అన్న సమయంలో ఏ రాజకీయ నాయకుడైన పార్టీ అయినా ప్రజల భద్రత కోసం మాట్లాడారు జాగ్రత్తలు ప్రభుత్వానికి సూచిస్తారు అలాంటిది బిజెపి పార్టీ మాకు అధికారం ఇవ్వండి అంటూ పండగను అడ్డంపెట్టుకుని మాట్లాడటం ఏంటి అంటూ మతాన్ని అడ్డం పెట్టుకుని రాజకీయాలు చేయాలంటే బీజేపీ తర్వాతే అంటూ కౌంటర్లు వేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news