తెలంగాణ అసెంబ్లీ కార్యదర్శికి హైకోర్టు నోటీసులు జారీ చేసింది. తెలంగాణ బిజెపి ఎమ్మెల్యేలు రాజాసింగ్ రఘునందన్ ఈటల రాజేందర్ పిటిషన్లపై ఇవాళ తెలంగాణ హైకోర్టు విచారణ చేసింది. రాజ్యాంగ విరుద్ధంగా బిజెపి ఎమ్మెల్యేలను సస్పెండ్ చేశారని… హైకోర్టు పిటిషనర్ తరఫు న్యాయవాది వివరించారు. అయితే దీనిపై తెలంగాణ హైకోర్టు తీవ్రంగా స్పందించింది.
ఈ నేపథ్యంలోనే తెలంగాణ అసెంబ్లీ కార్యదర్శికి హైకోర్టు నోటీసులు జారీ చేసింది. అసలు ఎందుకు తెలంగాణ బిజెపి ఎమ్మెల్యేలు రాజాసింగ్ రఘునందన్ ఈటల రాజేందర్ లను ఎందుకు సస్పెండ్ చేశారని హై కోర్టు ప్రశ్నించింది. దీనిపై వివరణ ఇవ్వాలని పేర్కొంది.
ఇక ఈ కేసును తెలంగాణ రాష్ట్ర హై కోర్టు రేపటికి వాయిదా వేసింది.కాగా.. రెండు రోజుల కిందట తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీసమావేశాలు ప్రారంభం అయిన సంగతి తెలిసిందే. అయితే.. ఈ సమావేశాల నేపథ్యంలో బీజేపీ ఎమ్మెల్యైన ఈటల, రఘునందన్, రాజాసింగ్ లను సస్పెండ్ చేశారు స్పీకర్ పోచారం. దీంతో ఈ వివాదం చెలరేగింది.