Telangana Budget 2023-24 : అసెంబ్లీలో నేటి నుంచి పద్దులపై చర్చ

-

తెలంగాణ అసెంబ్లీలో నేటి నుంచి బడ్జెట్ పద్దులపై చర్చ జరగనుంది. 2023 – 24 ఆర్థిక సంవత్సరానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌పై సాధారణచర్చ, మంత్రి హరీశ్ రావు సమాధానం… నిన్నటితో ముగిసింది. నేటి నుంచి బడ్జెట్ పద్దులపై మూడ్రోజులపాటు చర్చ జరగనుంది.

మొదటి రోజైన ఇవాళ సంక్షేమం, రహదారులు – భవనాలు, రెవెన్యూ, రిజిస్ట్రేషన్లు, లెజిస్లేచర్, పౌరసరఫరాలు, పర్యాటక, క్రీడా శాఖలకు చెందిన.. మొత్తం 12 పద్దులపై చర్చ జరుపుతారు. ప్రశ్నోత్తరాల అనంతరం పద్దులపై చర్చసాగనుంది. ప్రశ్నోత్తరాల్లో ఎస్​ఆర్​డీపీ , గొర్రెల పెంపకం, మైనార్టీలకు రుణాలు, ఆర్టీసీ ద్వారా సరుకు రవాణా, కళ్యాణలక్ష్మి పథకం, ఏకో టూరిజం, సమీకృత జిల్లా కార్యాలయాలు, ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సులో రాష్ట్రానికి పెట్టుబడులు, గనుల రాబడి, సబర్బన్ బస్సుల అంశాలు ప్రస్తావనకు రానున్నాయి.

మండలిలో బడ్జెట్‌పై చర్చ కొనసాగడంతో పాటు చర్చకు మంత్రి హరీశ్‌రావు ఇవాళ సమాధానమిస్తారు. మండలిలో నేడు ప్రశ్నోత్తరాలను రద్దు చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news