గృహలక్ష్మీ పథకం కింద మూడు విడతల్లో ₹3 లక్షలు.. కేబినెట్ గ్రీన్ సిగ్నల్

-

ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన సుదీర్ఘంగా సాగిన రాష్ట్ర కేబినెట్ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. సొంత స్థలాల్లో ఇళ్లు నిర్మించుకునే వారికి గృహ లక్ష్మి పథకం అమలు చేయాలని కేబినెట్ నిర్ణయించింది.  నియోజకవర్గానికి 3,000 చొప్పున రాష్ట్రవ్యాప్తంగా 4 లక్షల మందికి లబ్ధి చేకూర్చాలని నిర్ణయించింది. రూ.3 లక్షల గ్రాంటుగా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో 3 విడతల్లో జమ చేయనున్నట్లు రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు తెలిపారు.

”ఇంటి నిర్మాణానికి ఆర్థిక సాయం పథకానికి గృహలక్ష్మి పథకంగా పేరు పెడుతున్నాం. గృహలక్ష్మి పథకం కింద 4 లక్షల మందికి ఇంటి నిర్మాణానికి ఆర్థిక సాయం చేస్తాం. ప్రతి నియోజకవర్గానికి 3 వేల ఇళ్ల చొప్పున మంజూరు చేస్తాం. ఇంటి నిర్మాణానికి రూ.3 లక్షలను మూడు విడతల్లో ఇవ్వాలని నిర్ణయించాం. గృహ నిర్మాణ సంస్థ ద్వారా గతంలో నిర్మించుకున్న ఇళ్ల అప్పులను రద్దు చేస్తున్నాం.” – హరీశ్‌రావు, ఆర్థిక శాఖ మంత్రి

Read more RELATED
Recommended to you

Latest news