గుడ్‌ న్యూస్‌ : 57 ఏళ్లు నిండినవారికి వృద్దాప్య పెన్షన్: కేసీఆర్ …

-

గతంలో ఇచ్చిన హామీ మేరకు వృద్ధాప్య పింఛను ఇస్తామని… వచ్చే నెల నుంచి 57 ఏళ్లు నిండిన వారికి వృద్ధాప్య పింఛన్లు ఇస్తామని సీఎం కేసీఆర్‌ ప్రకటించారు. ఇవాళ రాజన్న సిరిసిల్ల నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో సీఎం కేసీఆర్‌ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..
గోదావరినే 500 మీట్లరు పైకి తెచ్చామని.. ఎస్సీలను పైకి తేలేమా ? ఎస్సీల కోసం రాబోయే నాలుగేళ్లలో రూ. 45 వేల కోట్లు ఖర్చు చేయబోతున్నామని పేర్కొన్నారు.

నర్సింగ్‌ విద్యార్థులకు స్టైఫండ్‌ పెంచుతున్నామని.. మొదటి ఏడాది నర్సింగ్‌ విద్యార్థులకు రూ. 5వేలు, అలాగే రెండో ఏడాది విద్యార్థులకు రూ. 6 వేలు, మూడో ఏడాది విద్యార్థులకు రూ. 7 వేలు స్టైఫండ్‌ ఇస్తామని హామీ ఇచ్చారు.

వచ్చే విడదతలలో రాజన్న సిరిసిల్లకు వచ్చితంగా వైద్య కళాశాల వస్తుందన్నారు. త్వరలో చేనేత కార్మికులకూ రైతు బీమా లాంటి పథకాన్ని తీసుకురాబోతున్నట్లు ప్రకటించారు. రైతుల్లాగే చేనేత కార్మికులకు రూ. 5 లక్షల బీమా వర్తింప చేసేలా పథకం తీసుకువస్తామని హామీ ఇచ్చారు సీఎం కేసీఆర్‌.

Read more RELATED
Recommended to you

Latest news