పీవీ నరసింహా రావు.. ఓ తెలుగు తేజం తెలుగు వారి ఖ్యాతిని పౌరుషాన్ని జాతికి చాటిచెప్పిన వారిలో ఒకరు. తెలుగు రాష్ట్రాల తొలి ప్రధాన మంత్రి నేడు ఆయన పుట్టిన రోజు. పీవీ నరసింహా రావు ఓ గొప్ప మేధావి నేర్పరి.. ఆర్థిక శాస్త్రాన్ని నరనరాల్లోకి జీర్ణించుకున్న ఓ గొప్ప ఆర్థిక వేత్త. నేటి గొప్ప ఆర్థిక వేత్తల్లో ఒకరైన మాజీ ప్రధాని మన్ మోహన్ సింగ్ యొక్క ఆర్థిక మరియు రాజకీయ గురువు కూడా ఆయనే. పీవీ దగ్గర పాఠాలు నేర్చుకున్న ఆర్థిక వేత్తల్లు ఎందరో ఉన్నారు. నేటికీ ఆయన ఖ్యాతిని చెప్పుకుంటున్నామంటే ఆయన దేశానికి ఎంతగానో సేవ చేశారు గనుకనే..! ఆయనను స్మరిస్తూ నేటి నుండి ఆయన శత జయంతి ఉత్సవాలను ప్రారంభించనున్నారు సీఎం కేసీఆర్. నేటి(ఆదివారం) నుంచి వచ్చే ఏడాది జూన్ 28 వరకు ఆయన శత జయంతి ఉత్సవాల రాష్ట్రంలో జరగనున్నాయి. నేడు ఉదయం 10 గంటలకు నెక్లెస్ రోడ్డులోని పీవీ సమాధి జ్ఞానభూమిలో ఈ ఉత్సవాలు కేసీఆర్ చేతుల మీదిగా ప్రారంభంకానున్నాయి.
నేటి నుండి ఘనంగా పీవీ శత జయంతి ఉత్సవాలు..! పీవీ మన ఠీవీ..!
-