తెలంగాణాలో కరోనా వైరస్ కేసుల సంఖ్య వేగంగా పెరుగుతుంది. అక్కడ తగ్గినట్టే తగ్గిన కరోనా కేసులు వేగంగా పెరుగుతున్నాయి. కట్టడి అయింది అనుకున్న కరోనా మళ్ళీ పెరగడంతో ఇప్పుడు ఆందోళన మొదలయింది. వారు అందరూ కూడా ఢిల్లీ నుంచి వచ్చిన వాళ్ళే కావడంతో ఇప్పుడు ప్రభుత్వం అప్రమత్తమవుతుంది. తెలంగాణలో కరోనా మృతుల సంఖ్య 9కి చేరింది. బుధవారం నాడు ముగ్గురు మృతి చెందారు.
అటు.. రోగుల సంఖ్య 107కు చేరింది. బుధవారం నాడు 30 మందికి పాజిటివ్ అని వచ్చింది. కరోనా ఉన్న రోగులు క్రమంగా కోలుకుంటున్నారు. వారి ఆరోగ్య పరిస్థితికి వచ్చిన ఇబ్బంది ఏమీ లేదని తెలంగాణా ప్రభుత్వం అంటుంది. తెలంగాణాలో కేసుల సంఖ్య పెరిగినా అది క్వారంటైన్ లో ఉన్న వాళ్ళ నుంచే గాని బయట ఎవరికి లేదని ప్రభుత్వం చెప్తుంది. అటు కేసీఆర్ అధికారులతో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించి పరిస్థితిని ఆరా తీసారు.