ఏపీ మందుబాబులు ఇది ఫాలో అవ్వండి గురు…!

-

కరోనా లాక్ డౌన్ పుణ్యమా అని ఇప్పుడు మందుబాబులకు నరకం కనపడుతుంది. ఇన్నాళ్ళు ప్రశాంతంగా ఉన్న మందుబాబులు ఇప్పుడు పైకి చెప్పుకోలేక ఏడ్చే పరిస్థితి ఏర్పడింది. తెలంగాణా, కేరళ, ఆంధ్రప్రదేశ్ లో మందుబాబులకు ఇప్పుడు పిచ్చి ఎక్కుతుంది. ఎన్ని విధాలుగా ప్రయత్న౦ చేసినా వాళ్ళు ఆ మందు గోల నుంచి బయటకు రావడం లేదు. పిచ్చి ఆస్పత్రులకు కూడా క్యూ కడుతున్నారు.

హైదరాబాద్ ఎర్రగడ్డ మానసిక వైద్య శాలకు ఇప్పుడు కొందరు మందు బాబులు వెళ్తున్నారు. అక్కడి వైద్యులకు కూడా వారికి వైద్యం చేయడం కష్టంగా మారింది ఇప్పుడు. ఇది పక్కన పెడితే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రజలకు, ముఖ్యంగా మద్యం ప్రియులకు కొన్ని సూచనలు చేసింది. ప్రోహిబిషన్ &ఎక్సైజ్ , డైరెక్టర్ ఆఫ్ ఎన్ఫోర్స్ మెంట్ వినీత్ బ్రిజ్ లాల్ కొన్ని సూచనలు చేశారు. కరోనా వైరస్ నియంత్రణ లో భాగంగా రాష్ట్రంలో మద్యపానం పూర్తిగా నిషేధంలో ఉంటుందని, మత్తుకు బానిసలైన కొంతమంది సహనం కోల్పయి చేతికి దొరికిన,

హానికర ద్రవాలను సేవించి అనారోగ్యనికి గురైతున్నారని, అలాంటి పనులు చేయొద్దని కోరారు. మద్యానికి బానిసలైన వారి పట్ల కుటుంబ సభ్యుల జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా వినీత్ బ్రిజ్ లాల్ సూహించారు. అనధికారికంగా మత్తు విక్రయాలు జరిపినా, ప్రత్యక్షంగా కానీ, పరోక్షంగా కానీ సహకరించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేసారు. అక్రమ విక్రయాల పై టోల్ ఫ్రీ నెంబర్ 18004254868, 9491030853, 08662843131 కు సమాచారం అందించాలని సూచించారు.

Read more RELATED
Recommended to you

Latest news