తెలంగాణలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. దీని దెబ్బకి ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. లాక్ డౌన్ సడలింపుల తర్వాతే దీని ప్రభావం మరీ తీవ్రంగా మారింది. ప్రభుత్వాలు ఎన్ని చర్యలు తీసుకున్నా.. దీన్ని కట్టడి చేయలేకపోతున్నారు. కాగా, గత 24 గంటల్లో తెలంగాణలో కొత్తగా 2,795 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. దీంతో ఇప్పటి వరకు నమోదైన కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1,14,483 కి చేరుకుంది.
Media Bulletin on status of positive cases #COVID19 in Telangana. (Dated. 27.08.2020)#TelanganaFightsCorona #StayHome #StaySafe
For complete Bulletin.. please click on below link 👇https://t.co/nJ24zLHdOe pic.twitter.com/H0bzsWkLwg
— Eatala Rajender (@Eatala_Rajender) August 27, 2020
అలాగే కొత్తగా 8 మరణాలు సంభవించాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం మరణాల సంఖ్య 778 కి చేరింది. అలాగే ఇప్పటి వరకు 86,095 మంది కోలుకుని డిశ్చార్జ్ అవ్వగా.. ప్రస్తుతం 27,600 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఈ మేరకు రాష్ట్ర వైద్యశాఖ హెల్త్ బులిటెన్‌ను విడుదల చేసింది. అయితే కొత్తగా నమోదైన కేసుల్లో జీహెచ్‌ఎంసీలో అధికంగా 449 కేసులు నమోదు అయ్యాయి.