తెలంగాణా హైకోర్ట్ రాష్ట్రంలో కరోనా పరిస్థితులపై విచారణ జరపగా సిఎస్ సోమేశ్ కుమార్ కుమార్ హైకోర్ట్ ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు. రాష్ట్రంలో కరోనా నివారణకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుంది అని అయన వివరించారు. ఐసిఎంఆర్ తో పాటుగా ప్రపంచ ఆరోగ్య సంస్థ గైడ్ లైన్స్ అన్నీ పాటిస్తున్నామని, ఆ ప్రకారమే టెస్ట్ లు చేస్తున్నామని ఆయన వివరించారు. తెలంగాణాలో ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఆక్సీజన్ బెడ్స్ అందుబాటులో ఉన్నాయని అన్నారు.
హసిఫాబాద్ లో 62, మహబూబాబాద్ లో 62 ఆక్సిజన్ బెడ్స్ ఏర్పాటు చేసినట్లు ఆయన హైకోర్ట్ కి వివరించారు. తెలంగాణ రాష్ట్రం లో రోజుకు 40 వేల కరోనా టెస్టులు చేస్తున్నామని ఆయన చెప్పారు. హితం యాప్ ను కేంద్ర బృందం , నీతి ఆయోగ్ ప్రశంసించిందని ఆయన చెప్పారు. మారుమూల గ్రామాల ప్రజలకు అసలు యాప్ అర్ధం కావడం లేదు అని వివరించాలని ఆయనకు సూచించింది.