ఈ ఏడాది ప్రవేశ పరీక్షలకు సంబంధించి తెలంగాణ ఉన్నత విద్యా మండలి కీలక ప్రకటన చేసింది. తాజాగా.. తెలంగాణ ఎడ్ సెట్ షెడ్యూల్ విడుదల చేసింది. జూన్ 1న పరీక్ష నిర్వహించనున్నారు. అందుకోసం వచ్చే నెల (మార్చి) 10న నోటిఫికేషన్ ఇవ్వనుంది. మార్చి 12 నుండి దరఖాస్తులు స్వీకరించనున్నారు. కాగా.. జూన్ 1న ఎగ్జామ్ ఉండనుంది.
బీఈడీ (B.Ed) కాలేజీల్లో ప్రవేశాల కోసం ఈ పరీక్ష నిర్వహిస్తారు. ఈ పరీక్ష రెండు సెషన్లలో జరుగనుంది. మొదటి సెషన్: ఉదయం 10:00 గంటల నుంచి మధ్యాహ్నం 12:00 గంటల వరకు, రెండవ సెషన్: మధ్యాహ్నం 2:00 గంటల నుండి సాయంత్రం 4:00 గంటల వరకు జరుగనుంది.