ప్రభుత్వ ఉద్యోగులు ఏ శాఖలో ఉన్నా జీతాలు మరియు డి ఏ ల పెరుగుదల విషయంలో మార్పులు ఆశించడం సహజమే. అయితే కొన్ని శాఖలలో మాత్రం ప్రభుత్వాలు జీతాలు పెంచకపోవడం చూస్తూ ఉంటాము. దీనికి చాలా కారణాలు ఉన్నా… ఉద్యోగులను సంతృప్తి పర్చడం ప్రభుత్వం యొక్క బాధ్యత. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలోని విద్యుత్ శాఖ లో ఫిట్మెంట్ మరియు ఇతర విషయాలపైనే యాజమాన్యానికి మరియు కార్మిక సంఘాలకు మధ్యన చర్చలు జరుగుతున్నాయి. ఇందుకు సంబంధించి ఒకడుగు ముందు పడినట్లు తెలుస్తోంది.
కాసేపటి క్రితమే ఉద్యోగులు మరియు యాజమాన్యం మధ్య జరిగిన ఒప్పందం ప్రకారం ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లో కార్మిక శాఖ కమిషనర్ శ్యాం సుందర్ లతో మీటింగ్ జరిగింది. ఇందులో ఫిట్మెంట్ మరియు ఇతర అంశాలపై కూడా చర్చించినట్లు సమాచారం. ఇకపై ఎవ్వరూ సమ్మెలకు పోకూడదని కమిషనర్ సూచించినట్లుగా తెలుస్తోంది.