విద్యాశాఖ అధికారులతో సబితా ఇంద్రారెడ్డి ఇవాళ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యాసంస్థల ప్రారంభం, కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ లపై సమీక్ష నిర్వహించిన విద్యా శాఖ… తెలంగాణ ఎంసెట్ పరీక్ష తేదీలను ఖరారు చేసింది. ఆగస్ట్ 5 నుండి 9 వరకు ఎంసెట్ నిర్వహిస్తామని తెలిపింది విద్యాశాఖ. అలాగే.. ఆగస్ట్ 3 న ఈ సెట్ నిర్వహిస్తామని… ఆగస్ట్ 11 నుండి 14 పీఈ సెట్ నిర్వహిస్తామని స్పష్టం చేసింది తెలంగాణ విద్యాశాఖ. అలాగే విద్యాసంస్థల నిర్వాహణపై చర్చించిన విద్యాశాఖ..ఆఫ్ లైన్ తరగతులకే మొగ్గు చూపునట్లు సమాచారం.
8వ తరగతి నుండి ఆపై తరగతుల ఆఫ్ లైన్ తరగతులు పెట్టాలనే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లు సమాచారం. జూలై 1 నుండి భౌతిక తరగతులు.. ఒకటి నుండి 5 వ తరగతి వరకు ఆన్లైన్ తరగతులు నిర్వహించనుంది సర్కార్. జులై ఒకటి నుండి డిగ్రీ, పిజి, వృత్తి విద్యా కళాశాలల్లో ప్రత్యక్ష తరగతులు నిర్వహించనుంది. ఇక ఈ నెల 25 నుండి ఉపాధ్యాయులు స్కూళ్లకు, లెక్చరర్లు కాలేజీలకు హాజరు కానున్నారు.