తెలంగాణ ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ స్వచ్ఛంద పదవీ విరమణ చేసినట్లు సమాచారం. ఆంధ్రప్రదేశ్ కేడర్‌కు చెందిన ఈ సీనియర్ ఐఏఎస్ అధికారి పెట్టుకున్న దరఖాస్తుకు ఏపీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఆమోదం తెలిపినట్లు తెలుస్తోంది. సోమేశ్ కుమార్ ఆంధ్రప్రదేశ్ కేడర్‌కు వెళ్లాలని తెలంగాణ హైకోర్టు ఇటీవల ఆదేశించిన విషయం తెలిసిందే.
హైకోర్టు ఆదేశాలతో తెలంగాణ ప్రభుత్వం సోమేశ్ కుమార్‌ను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పదవి నుంచి తొలగించింది. ఆయన జనవరి 12న అమరావతికి వచ్చి ఏపీ కేడర్‌లో రిపోర్టు చేశారు. అనంతరం ఏపీ ముఖ్యమంత్రి జగన్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఆయన ఏపీ ప్రభుత్వానికి రిపోర్టు చేసి నెల రోజులు దాటుతున్నా ఇప్పటివరకూ పోస్టింగ్ ఇవ్వలేదు. సోమేశ్‌కుమార్ స్వచ్ఛంద పదవీ విరమణకు దరఖాస్తు చేసుకోవడమే దానికి కారణమని తెలిసింది.