కరోనా వైరస్ విలయతాండవానికి ఏ రంగం స్థిరంగా నిలపడలేకపోయింది.. భారత ఆర్థిక వ్యవస్థ చిన్నాబిన్నం అయ్యింది, రాష్ట్రాల దగ్గర నిధులు కాళి అయ్యాయి ఉద్యోగులకు జీతాలు కూడా ఇవ్వలేని స్థితికి దిగజారాయి రాష్ట్ర ప్రభుత్వాలు. ఈ నేపద్యంలో తెలంగాణ ప్రభుత్వం గత కొన్ని నెలలుగా ప్రభుత్వ ఉద్యోగుల జీతాల్లో పెన్షనర్ల జీతాల్లో కొత్త విధించింది. పూర్తి వేతనం లేక ఉద్యోగులు కూడా అనేక అవస్థలు పడ్డారు. ఉద్యోగుల అవస్థలు చూడలేక తెలంగాణ ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు ఉద్యోగులకు ఓ తీపి కబురు అందించారు.
ఇక, ఇవాళ ఈ అంశం పై ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్లు, పబ్లిక్ సెక్టార్ మరియు కాంట్రాక్టు ఉద్యోగుల ఐక్యవేదిక పక్షాన కొంతమంది ప్రతినిధులు ఆర్థికశాఖ మంత్రి హరీష్‌రావును కలిసి వారి సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్లారు. మంత్రి హరీష్‌రావు సానుకూలంగా స్పందించినట్టు సమాచారం. జూన్ నెల నుండి విధించిన కోతతో పాటు పూర్తి వేతనాలు, విశ్రాంత ఉద్యోగులకు పెన్షన్లు ఇవ్వడానికి మంత్రి అంగీకరించినట్టు వెల్లడించారు. ఇదే అంశాన్ని ప్రస్తావిస్తూ ఓ ప్రకటన కూడా విడుదల చేశారు. ఇదివరకు విధించిన కోతని ఇన్ స్టాల్‌మెంట్స్ రూపంలో ఇవ్వడానికి సన్నాహాలు చేస్తున్నటుగా మంత్రి హరీష్ వారితో పేర్కొన్నారు.