ఏపీ మాదిరిగానే.. తెలంగాణలోనూ ‘నాడు-నేడు’

-

జగన్ సర్కార్ చేపట్టిన నాడు-నేడు కార్యక్రమం దేశంలోని పలు రాష్ట్రాలకు ఆదర్శప్రాయంగా నిలుస్తోంది. ఈ కార్యక్రమం కింద ఏపీలోని 45 వేల ప్రభుత్వ పాఠశాలలతో పాటు డిగ్రీ కాలేజీలను, అంగన్వాడీలను అభివృద్ధి చెందుతూ అభివృద్ధి చేస్తున్న సంగతి తెలిసిందే. 44,512 పాఠశాలల్లో రక్షిత మంచినీరు, మరుగుదొడ్లు, విద్యుదీకరణ, ఫర్నిచర్‌, పెయిటింగ్‌, మరమ్మతులు, ల్యాబొరేటరీల వంటి తొమ్మిది రకాల మౌలిక సదుపాయాలు కల్పించాలని లక్ష్యంగా పెట్టుకొన్నది. అయితే ఈ నేపథ్యంలో ఏపీ మాదిరిగానే తెలంగాణ ప్రభుత్వం కూడా నాడు-నేడు కార్యక్రమాన్ని అమలు చేయాలని నిర్ణయం తీసుకుంది.

తమ రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు మెరుగుపరచడం కోసం ఏపీ రూపొందించిన సాఫ్ట్ వేర్ ను రూపొందించి వినియోగించుకునేందుకు నో ఆబ్జెక్షన్ సర్టిఫికెట్ (ఎన్ వోసి) ఇవ్వాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ కార్యదర్శి సుల్తానియా.. ఏపీ విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బి. రాజశేఖర్ కు ఈ నెల 15న లేఖ రాశారు. దీనికి ఏపీ ప్రభుత్వం కూడా సానుకూలంగా స్పందించింది. తెలుగు ప్రజలకు ప్రయోజనం చేకూర్చేందుకు అవసరమైన సహకారాన్ని తెలంగాణ ప్రభుత్వానికి అందించడానికి తాము ఎప్పటికీ సిద్ధంగానే ఉన్నామని జగన్మోహన్ రెడ్డి స్పష్టం చేశారు. దీంతో తెలంగాణ ప్రభుత్వం అమలు చేయాలనుకున్న నాడు-నేడు కార్యక్రమానికి మార్గం సుగమం అయింది.

 

Read more RELATED
Recommended to you

Latest news