తెలంగాణలోని నిరుద్యోగులకు గుడ్‌న్యూస్. పోలీసు ఉద్యోగాల నోటిఫికేషన్ కోసం ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న వారి కల త్వరలోనే సాకారం కానుంది. పోలీస్ శాఖలో భారీగా ఖాళీల భర్తీకి తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే కసరత్తు మొదలైంది. పోలీస్ శాఖలో ఉన్న ఖాళీలను భర్తీ చేసేందుకు త్వరలోనే నోటిఫికేషన్ ఇచ్చే ఆలోచనలో ఉంది తెలంగాణ సర్కార్. దాదాపు 20 వేల పైచిలుకు కానిస్టేబుళ్ల పోస్టుల కు మరియు 625 ఎస్ఐ పోస్టులకు నోటిఫికేషన్ ఇచ్చేందుకు ప్రయత్నాలు మొదలు పెట్టింది.
ఈ మేరకు పోలీస్ శాఖలో ఖాళీలను గుర్తించి ఆర్థిక శాఖకు నివేదిక పంపారు డీజీపీ మహేందర్ రెడ్డి. డీజీపీ నివేదికను ఆర్థికశాఖ పరిశీలించి… ఆమోదం చెప్పిన వెంటనే పోలీసు నియామకాలకు నోటిఫికేషన్ విడుదల కానుంది. అటు తెలంగాణ నూతన జోనల్ వ్యవస్థ కూడా అమలులోకి రావడం శుభ సూచికం. పోలీసు నియమకాలను కొత్త జోనల్ వ్యవస్థ ద్వారానే.. చేపట్టనుంది తెలంగాణ సర్కార్. కాగా… ఇటీవలే… తెలంగాణ హోం మంత్రి మహమూద్ అలీ కూడా పోలీసు నియామకాలను తర్వలోనే భర్తీ చేస్తామని ప్రకటించిన సంగతి తెలిసిందే.