తెలంగాణాలో కరోనా కట్టడికి ప్రభుత్వం అన్ని విధాలుగా చర్యలు తీసుకుంటుంది. జాగ్రత్తగా ఒక దాని తర్వాత ఒకటి చేసుకుంటూ పోతుంది తెలంగాణా సర్కార్. పాపం ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా సరే కరోనా వైరస్ మాత్రం తెలంగాణాలో కట్టడి అయ్యే అవకాశాలు కనపడటం లేదు. నిన్న ఒక్క రోజే 8 కేసులు నమోదు అయ్యాయి. ఈ నేపధ్యంలో తెలంగాణా ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది.
ఇక నుంచి స్విగ్గీ, బిగ్ బాస్కెట్ వంటి డోర్ డెలివరీ కంపెనీల ద్వారా పాలు సరఫరా చేసేలా చెయ్యాలని పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అధికారులను ఆదేశాలు జారీ చేసారు. మాసాబ్ ట్యాంక్ లోని పశుసంవర్ధక శాఖ భవనంలో శనివారం వివిధ డెయిరీల ప్రతినిధులతో ఆయన సమావేశం నిర్వహించి పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. HMDAలో లాక్‌డౌన్‌కు ముందు రోజూ 30 లక్షల లీటర్ల పాలు సప్లై అయ్యేవనీ,
ఇప్పుడు 27 లక్షలకు తగ్గాయనీ… పాలను సప్లై చేసే సిబ్బంది రావట్లేదని విజయ డెయిరీ ఎండీ శ్రీనివాసరావు మంత్రికి వివరించారు. మరి స్విగ్గీ, బిగ్ బాస్కెట్ సేవలు వాడుకోమని మంత్రి ఆదేశించారు. త్వరలోనే ప్రతీ ఇంటికి పాలను సప్లై చెయ్యాలని మంత్రి సూచనలు చేసినట్టు సమాచారం. పాల ప్యాకెట్లపై కరోనా వైరస్ ఉందని అనిపిస్తే… ఆ ప్యాకెట్లను హ్యాండ్ శానిటైజర్ రాసుకున్న చేతులతో పట్టుకోవచ్చు.