ధాన్యం కొనుగోళ్లపై తెలంగాణ గవర్నర్ తమిళి సై సౌందర రాజన్ కీలక ప్రకటన చేశారు. నల్గొండ పట్టణంలోని ఆర్జాలబావి ఐకేపీ సెంటర్ కు ఇవాళ చేరుకున్న గవర్నర్ తమిళి సై సౌందర రాజన్.. ఐకేపీ సెంటర్ ను పరిశీలించారు. ఈ సందర్భంగా గవర్నర్ తమిళి సై సౌందర రాజన్ మాట్లాడుతూ.. ఇప్పటి వరకు తెలంగాణలో 72 శాతం పైగా కొనుగోలు జరిగిందని ప్రకటన చేశారు.
గతంలో కంటే ఈ సారి ఎక్కువ కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశారని తెలిపారు గవర్నర్ తమిళి సై. ఎంత ధాన్యం పండించారు, ఎన్ని ఎకరాల్లో సాగు చేశారు అని ఈ సందర్భంగా రైతులను అడిగి తెలుసుకున్నారు గవర్నర్. ఈ సారి వర్షం వల్ల చాలా ఇబ్బందులు పడ్డామని..రైతులు చెబుతున్నారని ఆమె పేర్కొన్నారు.. ఈ సారి సీజనల్ ఇబ్బందులని రైతులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు ఉండకుండా చూడాలని గవర్నర్ తమిళి సై సౌందర రాజన్ ఆదేశించారు.