తెలంగాణాలో దసరా మరియు బతుకమ్మ పండుగలను పురస్కరించుకుని ప్రభుత్వం సెల్వయూలను ప్రకటిస్తూ ఉత్తర్వులను జారీ చేసింది. ప్రతి సంవత్సరం లాగే ఈసారి కూడా బతుకమ్మ పండుగను ఎంతో ఘనంగా జరిపించడానికి ప్రభుత్వం ఏర్పాట్లను చేస్తోంది. ఇక ఈ ఉత్తర్వుల ప్రకారం అక్టోబర్ 14వ తేదీ నుండి అక్టోబర్ 24వ తేదీ వరకు ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోకి వచ్చే అన్ని ప్రభుత్వ మరియు ప్రయివేట్ కాలేజీలకు సెలవులను ఇవ్వడం జరిగింది. అండర్ గ్రాడ్యుయేట్ మరియు పోస్ట్ గ్రాడ్యుయేట్ కాలేజీల విద్యార్థులకు సెలవులు ఇవ్వగా, తిరిగి అక్టోబర్ 25వ తేదీ కాలేజీలు ప్రారంభం కానున్నాయి. ఇక ఇంతకు ముందు ప్రకటించిన విధంగానే స్కూల్స్ కు అక్టోబర్ 13 నుండి సెలవులు ఉన్నాయి. ఇది ఇప్పటి వరకు ప్రభుత్వం నుండి వచ్చిన అధికారిక వార్త.
కాగా ఈ సారి బతుకమ్మ పండుగలో ప్రభుత్వం ఏ విధంగా పాల్గొంటారన్నది సందేహమే. ఎందుకంటే నవంబర్ 30న ఎన్నికలు జరగనుండడంతో బిజీగా ఉన్నారు.