దసరా పండగ వేళ టీఎస్ ఆర్టీసీ ప్రయాణికులకు గుడ్ న్యూస్ తెలిపింది. దసరా పండగకు సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికులకు అదనపు భారం తప్పింది. పండగ వేళ ప్రజల నుంచి అధిక ఛార్జీలు వసూలు చేద్దాం అనుకుంటున్న టీఎస్ ఆర్టీసీ వెనక్కి తగ్గింది. ముఖ్యంగా రిజర్వేషన్లు చేసుకునే ప్రయాణికలుకు అదనపు వడ్డింపు నుంచి ఉపశమనం కల్పించింది. రిజర్వేషన్ ప్రయాణికులకు రాష్ట్ర అంతర్రాష్ట్ర సర్వీసుల్లో సాధారణ ఛార్జీలే వసూలు చేయాలని నిర్ణయించారు. ఈమేరకు ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ఆదేశాలు జారీ చేశారు. పండగ తర్వాత తిరిగి వచ్చే ప్రయాణికులకు కూడా సాధారణ ఛార్జీలు వసూలు చేస్తామని తెలిపారు. నష్టాల్లో కూరుకుపోతున్న ఆర్టీసీని పండగ వేళ లాభాలతో బయటపడేద్దామని ఆర్టీసీ అధికారులు భావిస్తున్నారు. హైదరాబాద్ నుంచి జిల్లాకు వెళ్లే ప్రత్యేక బస్సుల్లో 50 శాతం దాకా అదనపు ఛార్జీలు వసూలు చేయనున్నారు. దసరా పండగ సందర్భంగా ఎంతోకొంత ఆదాయాన్ని వెనుకేసుకోవాలని ఆర్టీసీ అనుకుంటుంది.
ఆ ప్రయాణికులకు గుడ్ న్యూస్… అదనపు వసూళ్లపై వెనక్కితగ్గిన టీఎస్ ఆర్టీసీ
-