తెలంగాణ నిరుద్యోగులకి త్వరలో శుభవార్త

-

తెలంగాణ నిరుద్యోగులకి త్వరలో శుభవార్త చెప్పే అవకాశం ఉందని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. రేపో మాపో కేసీఆర్ నిరుద్యోగ భృతి ప్రకటన చేస్తారు అని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. తెలంగాణ వచ్చిన తర్వాత ఒక లక్ష 31 వేయి ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పటికే ఇచ్చామన్న ఆయన కేసీఆర్ నాయకత్వం లో తెలంగాణ కోటిన్నర ఎకరాల మగాణి అయ్యిందని అన్నారు. మౌలిక సమస్యల నుండి కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ బయటపడిందన్న ఆయన ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ కాళేశ్వరం ను కాలంతో పోటీ పడి కేసీఆర్ పూర్తి చేశారని అన్నారు.

ఉమ్మడి పాలకుల కాలంలో విద్యుత్ తీవ్ర సమస్యగా ఉండేది… ఇది అందరికీ గుర్తు అని ఆయన అన్నారు.  తెలంగాణ ఏర్పడ్డ మొదటి ఆరు నెలలలోనే విద్యుత్ సమస్యను అధిగమించామన్న ఆయన పర్యావరణ హితంగా ఉండే సోలార్ ఎనర్జీ ఉత్పత్తి లో దేశంలో తెలంగాణ 2 వ స్థానంలో ఉందని అన్నారు. ఈ ప్రభుత్వం మీ ప్రభుత్వం అని పేర్కొన్న ఆయన భారత దేశంకు బువ్వ పెట్టె పరిస్థితికి తెలంగాణ చేరిందని అన్నారు. 

Read more RELATED
Recommended to you

Latest news