తెలంగాణను ఢిల్లీకి ఏటీఎం గా మార్చారు : అమిత్ షా

-

తెలంగాణ రాష్ట్రాన్ని ఢిల్లీకి ATM గా మార్చేశారని.. కేంద్ర మంత్రి, బీజేపీ నేత అమిత్ షా కాంగ్రెస్ ప్రభుత్వం పై ఆరోపణలు గుప్పించారు. సిద్ధిపేటలో బీజేపీ విశాఖ జనసభలో ఆయన పాల్గొన్నారు. మోడీ మరోసారి ప్రధాని అయితే.. తెలంగాణలో అవినీతి లేకుండా చేస్తారని పేర్కొన్నారు. అందుకోసం రాష్ట్రంలో 12 ఎంపీ స్థానాల్లో బీజేపీని గెలిపించాలని ఆయన ప్రజలను కోరారు. సమగ్ర తెలంగాణ వికాసం బీజేపీతోనే సాధ్యమని ఆయన తెలిపారు.

అయోధ్య లో రామమందిరం నిర్మాణం ఏర్పాటు చేయడం కాంగ్రెస్ పార్టీకి ఇష్టం లేదని.. అందుకే నిర్మాణం చేయకుండా కేసులు వేసిందన్నారు. మోడీ కేసులు గెలిచి మందిర నిర్మాణం చేసి బలరాముడి ప్రాణ ప్రతిష్ట చేశారు. ఆర్టికల్ 370 రద్దు చేసి 70 ఏళ్ల సమస్యను పరిష్కరించారని తెలిపారు. కాశ్మీర్ మన దేశంలో అతర్భాగమా..? కాదా..? బీఆర్ఎస్, కాంగ్రెస్ రెండూ ఒక్కటే అన్నారు. ఈ దేశాన్ని బ్రష్టు పట్టిస్తున్నారని పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news