మార్చి 5న “తెలంగాణ హెల్త్ ప్రొఫైల్” ప్రారంభం : మంత్రి హ‌రీశ్‌రావు

-

మార్చి 5 వ తేదీన సిరిసిల్ల ,ములుగు జిల్లాల్లో ప్రయోగాత్మకంగా తెలంగాణ హెల్త్ ప్రొఫైల్ ను లాంచ్ చేస్తున్నామనీ మంత్రి హరీష్ రావు ప్రకటన చేశారు. నిర్మల్ జిల్లాలోని ప్రైవేట్ ఆసుపత్రుల పనితీరుపై ఇవాళ మంత్రి హరీష్ రావు సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..త్వరలోనే తెలంగాణ హెల్త్ ప్రొఫైల్ ను రాష్ట్రమంతా విస్తరింపచేస్తామని.. అందులో ప్రతి ఒక్కరి హెల్త్ కు సంబంధించిన వివరాలు ఉంటాయని స్పష్టం చేశారు.


తెలంగాణ రాష్ట్రంలో మందుల కొరత లేకుండా చేస్తున్నామన్నారు. మందులు లేవని ఎవరన్నా అంటే వారిని ఉద్యోగంలోంచి తొలగిస్తామని.. మందులు పెంచాం అందుబాటులోకి తెచ్చాం బడ్జెట్ సైతం పెంచామని వెల్లడించారు. అరవై ఏళ్ల సమైక్య రాష్ట్రంలో మూడు మెడికల్ కాలేజీలు ఉంటే తెలంగాణ వచ్చిన తర్వాత పదిహేడు మెడికల్ కాలేజీలు వచ్చాయన్నారు.

పార్లమెంట్లో కేంద్రమంత్రి వైద్యం తెలంగాణ మూడోస్థానంలో ఉందని ప్రకటించా రు. రానున్న రోజుల్లో మొదటి స్థానంలోకి దూసుకెళ్దామని చెప్పారు మంత్రి హరీష్ రావు. ప్రసవం కోసం వస్తే ప్రైవేట్ ఆసుపత్రుల్లో 95 శాతం సర్జరీలే చేస్తున్నారు..ఎంత అన్యాయం..పద్దతి మారాలి.. ఆపరేషన్లు చేసి తల్లులు ఆరోగ్యంతో చెలగాటం ఆడొద్దని హెచ్చరించారు.

 

Read more RELATED
Recommended to you

Latest news