మార్చి 06న ‘సీఎం కేసీఆర్‌కు తెలంగాణ ఆడబిడ్డల రాఖీ’ కార్య‌క్ర‌మం

-

మ‌హిళా దినోత్స‌వం వేడుక‌లు ఘ‌నంగా నిర్వ‌హించాల‌ని టీఆర్ఎస్ కార్య‌నిర్వాహ‌క అధ్య‌క్షుడు, మంత్రి కేటీఆర్ టీఆర్ఎస్ నేత‌ల‌కు పిలుపునిచ్చారు. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, జిల్లా అధ్య‌క్షుల‌తో టెలీకాన్ఫ‌రెన్స్ నిర్వ‌హించారు. మ‌హిళా బంధు కేసీఆర్ పేరిట‌.. ఈ నెల 6,7,8న సంబురాలు నిర్వ‌హించాల‌ని ఆదేశించారు. మార్చి 06న కేసీఆర్‌కు రాఖీ క‌ట్టే కార్య‌క్ర‌మం నిర్వ‌హించాల‌ని మంత్రి కేటీఆర్ సూచించారు.

పారిశుధ్య కార్మికులు, వైద్యులు, ఏఎన్ఎంలు, విద్యార్థినులు, ఆశావ‌ర్క‌ర్లు, స్వ‌యం స‌హాయ‌క సంఘాల స‌భ్యుల‌ను స‌న్మానించాల‌ని మంత్రి ఆదేశించారు. కేసీఆర్ కిట్‌, షాదీముబార‌క్‌, థాంక్యూ కేసీఆర్ వంటి ఆకారాల‌తో మాన‌వ‌హారాలు జ‌ర‌పాల‌న్నారు. ఈనెల 7న క‌ల్యాణ‌ల‌క్ష్మీ, కేసీఆర్ కిట్ ల‌బ్దిదారుల‌తో సెల్పీలు తీసుకోవాల‌ని చెప్పారు. మార్చి 08న నియోజ‌క‌వ‌ర్గం స్థాయిలో మ‌హిళ‌ల‌తో భేటీలు జ‌రిపి సంబురాలు నిర్వ‌హించాల‌ని టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, జిల్లా అధ్య‌క్షుల‌కు మంత్రి కేటీఆర్ దిశానిర్దేశం చేసారు.

Read more RELATED
Recommended to you

Latest news