ఎన్నికల సంఘానికి హైకోర్ట్ కీలక ఆదేశాలు.. ఆరోజున బయటకు రావొద్దు !

-

ఎన్నికల సందర్భంగా ఎమ్మెల్యేలు ఎంపీలు ఇతర ప్రజాప్రతినిధులు బయటకు రాకూడదని, వారు కేవలం ఓటు మాత్రం వేసేందుకు బయటికి వచ్చేలా చూడాలి అంటూ ఎన్నికల సంఘాన్ని, పోలీసులను తెలంగాణా హైకోర్టు కోరింది. ఈ మేరకు ఆదేశాలు జారే కూడా అయ్యాయి. నిజానికి ఎన్నికల సమయంలో అధికారంలో ఉన్న ప్రజా ప్రతినిధులు బయట ఉంటే ఓటింగ్ ని ప్రభావితం చేసే అవకాశం ఉంటుందని అందుకే వారిని కట్టడి చేయాలని పేర్కొంటూ ఒక పిల్ దాఖలు అయింది.

దానిని విచారించిన హైకోర్టు ఈ నిర్ణయం తీసుకుంది. ఇక ఈరోజుతో ఎన్నికల ప్రచారం ముగియనుంది. సాయంత్రం 5 గంటల కల్లా మైకులు అన్నీ కట్టేయాల్సి ఉంటుంది. దీంతో, ప్రధాన పార్టీల మధ్య విమర్శల పర్వం మరింత తీవ్రతరం అయ్యే అవకాశముందని అంటున్నారు విశ్లేషకులు. టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ నేతలు నగరమంతా తిరుగుతూ ప్రచారం చేస్తున్నారు. ఇక డిసెంబర్ 1న జరగనున్న పోలింగ్‌ కోసం రాష్ట్ర ఎన్నికల కమిషన్ అన్ని ఏర్పాట్లు చేసింది. ఇక గ్రేటర్ ఫలితాలు డిసెంబర్ 4న వెలువడనున్నాయి.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version