కులగణన లో దేశానికే తెలంగాణ రోల్ మోడల్ అని రాహుల్ గాంధీ పేర్కొన్నారు. బోయినపల్లిలోని ఐడియాలజీ సెంటర్ లో మేధావులు, బీసీ సంఘాలతో ముఖాముఖి నిర్వహించారు. ఈ సందర్భంగా రాహుల్ గాంధీ మాట్లాడుతూ దేశంలో కుల వివక్షత ఉన్నదన్నది వాస్తవం. ప్రధాని నరేంద్ర మోడీ ఇంత వరకు కులవివక్ష గురించి మాట్లాడలేదు. దేశంలో ఎంత మంది దళిత వ్యాపారులు ఉన్నారో చెప్పాలి. బ్యూరో క్రాట్స్ చేసే కులగణన మనకు అవసరం లేదు. మేము చేస్తున్నది కుల గణన కాదు.. అడ్మినిస్ట్రేషన్ ఎలా ఉండాలో నిర్ణయిస్తున్నాం.
రిజర్వేషన్ల పై ఉన్న 50 శాతం పరిమితిని ఎత్తేస్తున్నామని తెలిపారు. దేశంలో ఎంత మంది నిరుపేదలు ఉన్నారో తెలుసుకోవాలి. జాతీయ స్థాయిలో కులగణన చేపడుతామని పార్లమెంట్ సాక్షిగా చెప్పినట్టు గుర్తు చేశారు రాహుల్ గాంధీ. కులగణనలో ఏ ప్రశ్నలు అడగాలో దళితులు, ఆదివాసులు, ఓబీసీలే నిర్ణయించాలన్నారు. దేశంలో ఎంతమంది ఓబీసీలు న్యాయ వ్యవస్థలో ఉన్నారు. దేశం ఆర్థికంగా శక్తిమంతంగా ఎదగాలంటే కుల వివక్ష ఉండకూడదని పేర్కొన్నారు రాహుల్ గాంధీ.