లెక్కల ప్రకారం బీసీల రిజర్వేషన్ పెంచుతున్నాం : మంత్రి ఉత్తమ్

-

రాష్ట్రంలో కుల గణన చేపట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం అత్యంత చిత్తశుద్ధి తో పని చేస్తుంది అని నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. అయితే రాహుల్ గాంధీ తెలంగాణలో పర్యటించిన సందర్భంలోను ఎన్నికల సమయంలోను కులగణన చేపడుతామని హామీ ఇచ్చారు. ఆ హామీ నెరవేర్చేందుకు ప్రభుత్వం అన్ని విధాలుగా కృషి చేస్తోంది. కుల గణన చేస్తామని మ్యానిఫెస్టోలో చెప్పాం. ఇచ్చిన మాట ప్రకారం కుల గణన చేస్తున్నాం అని అన్నారు.

ఇక కుల గణన కోసం తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లో ఫీల్డ్ స్టడీ చేశాం. లోకల్ బాడీ ఎన్నికల్లో జనాభా లెక్కల ప్రకారం బీసీల రిజర్వేషన్ పెంచుతున్నాం. బిసి రిజర్వేషన్లు కోసం కోర్ట్ డెడికేటెడ్ బీసీ కమిషన్ వేయాలని సూచిస్తే వెంటనే వేశాము. ప్రభుత్వానికి బిసిల అభ్యున్నతి, సంక్షేమం పట్ల చిత్తశుద్ధి ఉందిఅని మంత్రి ఉత్తమ్ పేర్కొన్నారు. అయితే ఈరోజు కుల గణన కోసం ఏర్పాటు చేసిన సభకు రాహుల్ గాంధీ హాజరు అయిన సంగతి తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Exit mobile version