ఆర్టీసీ కార్మికుల సమ్మె రోజురోజుకీ ఉధృతం అవుతోంది. ప్రభుత్వం మెట్టు దిగి రాకపోవడంతో కార్మికులు సైతం బెట్టు వీడటం లేదు. మరోవైపు ఆర్టీసీ సమ్మె పిటిషన్‌పై నేడు హైకోర్టులో వాదనలు జరగనున్నాయి. ప్రభుత్వం, ఆర్టీసీ, కార్మిక సంఘాలు మరోసారి పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయనున్నారు. గతంలో ప్రభుత్వం దాఖలు చేసిన కౌంటర్‌పై హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. ఇది ఇలాఉంటే కార్మికుల ఆత్మహత్యలపై హైకోర్టుకు కార్మిక సంఘాలు నివేదిక సమర్పించనున్నాయి.
సమ్మె నివారణ, ప్రజల ఇబ్బందులపై న్యాయవాది రాపోలు భాస్కర్ మరో పిల్ దాఖలు చేశారు. అన్ని పిటిషన్‌లు కలిపి నేడు హైకోర్టు మరోసారి విచారించనుంది. 11 రోజులుగా ఆర్టీసీ కార్మికులు సమ్మె చేపడుతున్న నేపథ్యంలో హైకోర్టు తీర్పుపై ఉత్కంఠ నెలకొంది.