జగన్ సర్కారు ప్రతిష్టాత్మకంగా తీసుకున్న రైతుభరోసా పథకం నేటి నుంచి ప్రారంభం కానుంది. నెల్లూరు జిల్లా నుంచి ముఖ్యమంత్రి జగన్ ప్రారంభించనున్నారు. విక్రమసింహపురి యూనివర్శిటీలో ఇందుకోసం పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేశారు. ఉదయం 11 గంటలకు రైతుభరోసా పథకాన్ని ప్రారంభించనున్న జగన్ లబ్దిదారులకు చెక్కులు, కౌలు రైతులకు ధృవీకరణ పత్రాలు అందజేస్తారు. కాగా, రైతు భరోసా మొత్తాన్ని రూ.12,500 నుంచి రూ.13,500కు పెంచుతున్నట్లు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి ప్రకటించారు.
ఈ పథకం ద్వారా సుమారు రాష్ట్రంలో 54 లక్షల మంది రైతులకు లబ్ధిపొందే అవకాశం ఉన్నట్లు చెబుతున్నారు. ప్రస్తుతానికి 40 లక్షల మంది రైతులను ఎంపిక చేయడం పూర్తి చేశారు. తాజాగా రైతుభరోసా సాయాన్ని పెంచారు. ఇక నుంచి రైతుకు 13,500 చొప్పున నాలుగేళ్లకు 67, 500 పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు.