ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఫలితాలు రేపే విడుదల…?

తెలంగాణ ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఫలితాలను ఇంటర్ బోర్డు రేపే విడుదల చేయాలని అధికారులు భావిస్తున్నారు. కరోనా విజృంభణ నేపథ్యం లో గత ఏడాది ఇంటర్ ఫస్ట్ ఇయర్ పరీక్షలను రద్దు చేసిన సంగతి తెలిసిందే. అయితే ఆ పరీక్షలను ఇటీవల నిర్వహించారు. దాంతో రేపు ఫలితాలు విడుదల చేసే ఆలోచనలో అధికారులు ఉన్నట్టు సమాచారం.

ఇదిలా ఉండగా ఇంటర్ వార్షిక సంవత్సర పరీక్షలను వచ్చే ఏడాది ఏప్రిల్ లో నిర్వహించనున్నట్టు సమాచారం అందుతోంది. పరీక్షలు షెడ్యూల్ ప్రకారంగా 2022 మార్చి 23 నుండి జరగాల్సి ఉంది. కానీ ఈ ఏడాది కూడా కరోనా మహమ్మారి విజృంభణ కారణం గా క్లాసులు లేటుగా ప్రారంభం అయ్యాయి. దాంతో వచ్చే ఏడాది ఏప్రిల్ లో నిర్వహించాలనే ఆలోచనలో ఇంటర్ బోర్డు ఉన్నట్టు తెలుస్తోంది.