తెలంగాణ ఇంటర్ విద్యార్థులు అందరూ రీ వెరిఫికేషన్ రీకౌంటింగ్ ఫలితాల కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రీకౌంటింగ్ రీవెరిఫికేషన్ ఫలితాల విడుదల తేదీని ఇటీవల తెలంగాణ విద్యాశాఖ ప్రకటించింది బుధవారం రోజున ఇంటర్మీడియట్ రీ వెరిఫికేషన్ రీకౌంటింగ్ ఫలితాలు విడుదల కానున్నట్లు విద్యాశాఖ తాజా ప్రకటన విడుదల చేసింది. ఇక ఈ ఫలితాలను.. ఇంటర్ బోర్డు అధికారిక వెబ్సైట్ ద్వారా… మార్కులు స్కాన్ చేసిన జవాబు పత్రాలను కూడా విద్యార్థులు డౌన్లోడ్ చేసుకునేందుకు అవకాశం ఉంది అంటూ తెలంగాణ విద్యాశాఖ తెలిపింది
ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 37387 మంది విద్యార్థులు ఈ ఫలితాల కోసం ఎదురు చూస్తున్నారు. కాగా మొత్తం 72, 496 సబ్జెక్టులో రీవెరిఫికేషన్ రీకౌంటింగ్ కోసం విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నట్లు విద్యా శాఖ తెలిపింది. అయితే ఇప్పటి వరకు కేవలం 71,298 జవాబు పత్రాలను మాత్రమే ధృవీకరించామని తెలిపిన తెలంగాణ విద్యాశాఖ ఇంకో 1198 జవాబు పత్రాలను నెలాఖరు వరకు పూర్తి చేస్తామని వెల్లడించారు. ఆగస్టు 1 నుంచి మెమో లను కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చని… ఈ సందర్భంగా తెలంగాణ ఇంటర్ బోర్డు తెలిపింది.