బాబ్రీ మసీదు కేసు నిందితుల వాంగ్మూలం పూర్తి..!

-

బాబ్రీ మసీదు కేసులో నిందితుల వాంగ్మూలాన్ని నమోదు చేసే ప్రక్రియను పూర్తి చేసింది లఖ్​నవూలోని ప్రత్యేక సీబీఐ కోర్టు. మంగళవారం 32 మంది నింబాదితుల్లో ఒకరైన శివసేన మాజీ ఎంపీ సతీశ్​ ప్రధాన్​ వాంగ్మూలాన్ని వీడియో కాన్ఫరెన్స్​ ద్వారా నమోదు చేసింది. రాజకీయ లబ్ధి కోసమే తనను ఈ కేసులో ఇరికించారని.. తనకు ఈ కేసుతో ఎలాంటి సంబంధం లేదని సీబీఐ ప్రత్యేక న్యాయమూర్తి ఎస్​కే యాదవ్​కు విన్నవించారు సతీశ్​.

babri masid
babri masid

32 మంది నిందితుల జాబితాలో చివరి నుంచి రెండో వ్యక్తి ప్రధాన్​. చివరి వ్యక్తి అయిన ప్రకాశ్​ పాండే అందుబాటులో లేరు. ఆయన 15-16ఏళ్ల క్రితమే సన్యాసం తీసుకున్నారని, ఆ తర్వాత ఇంటికి రాలేదని పాండే కుటుంబసభ్యులు సీబీఐకి తెలిపారు.సుప్రీంకోర్టు ఆదేశం మేరకు… సీఆర్​పీసీ సెక్షన్ 313 కింద బాబ్రీ కేసును విచారిస్తోంది సీబీఐ ప్రత్యేక కోర్టు. ఇందులో భాగంగా గత వారం భాజపా నాయకుడు మనోహర్​ జోషి, మాజీ ఉప ప్రధాని ఎల్​కే అడ్వాణీ వాంగ్మూలాలను రికార్డు చేసింది సీబీఐ. ఈ కేసుకు సంబంధించి పూర్తి విచారణ ఆగస్టు 31న పూర్తికానుంది.

Read more RELATED
Recommended to you

Latest news