Telangana Budget 2023-24 : తెలంగాణ నీటి పారుదల రూ. 26,885 కోట్లు

-

తెలంగాణలో మండు వేసవిలోనూ మత్తడి దూకేలా చెరువులు, ఎత్తిపోతల ప్రాజెక్టుల ద్వారా రిజర్వాయర్లకు చేరుతున్న నదీజలాలలు.. సాగునీటి రంగంలో రాష్ట్రం సాధించిన అద్భుతాలు ఆవిష్కరిస్తున్నాయని ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు తెలిపారు. రాష్ట్ర నీటిపారుదల రంగానికి బడ్జెట్‌లో రూ.26,885 కోట్లు ప్రతిపాదిస్తున్నట్లు తెలిపారు. ఏదేమైనా.. ఎవరు కలిసి వచ్చినా రాకున్నా.. ప్రజల ఆశీస్సులే కొండంత అండగా భావించి.. తెలంగాణ సర్కార్ కోటి 25 లక్షల ఎకరాలకు సాగునీరు అందించే లక్ష్యాన్ని త్వరలోనే చేరుకునేందుకు కృతనిశ్చయంతో ముందుకు సాగుతోందని వివరించారు.

‘తెలంగాణ సర్కార్ తదేక దీ క్షతో సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణాన్ని జరిపిస్తోంది. కేంద్రం తోడ్పాటు ఇవ్వకపోవడమే కాకుండా.. సకాలంలో అనుమతి ఇవ్వకుండా అడ్డంకులు సృష్టిస్తోంది. కృష్ణా నదీ జలాల్లో తెలంగాణ వాటాను నిర్ధారించమంటే. .విపరీతమైన తాత్సారం చేస్తోంది. రాష్ట్రంలో నిర్మిస్తున్న ఒక్క ప్రాజెక్టుకు అయినా జాతీయ హోదా కల్పించాలని కేంద్రానికి ఎన్ని విజ్ఞప్తులు చేసినా.. స్పందించడం లేదు.’ అని మంత్రి హరీశ్ రావు అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news