టీఆర్ఎస్, కేసీఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత… హైదరాబాద్ తో పాటు రాష్ట్రంలో ఎక్కడా కూడా మతం పేరుతో చిచ్చు పెట్టే చిల్లర పంచాయతీ చేయబోమని మంత్రి కేటీఆర్ అన్నారు. కులాలు మతాల పేరిట ప్రజలు మధ్య చిచ్చు పెట్టి ఆ చిచ్చులో చలిమంటలు కాపుకునే చిల్లర పనులు చేయబోమని స్పష్టం చేశారు. తన చిన్నతనంలో అబిడ్స్ లో గ్రామర్ స్కూల్లో చదువుకున్నానని.. ప్రతీ సంవత్సరం నాలుగైదు రోజుల నుంచి వారం పదిరోజులు ఏదో సమస్యపై స్కూళ్లు బంద్ ఉండేవని.. ఇప్పుడు ఆ పరిస్థితి లేదని ఆయన అన్నారు.
కేసీఆర్ గారి నాయకత్వంలో శాంతి భద్రతను కాపాడుకుంటున్నామని.. మతం పేరుతో ఎవరైనా చిచ్చపెట్టే ప్రయత్నం చేస్తే ఉక్కుపాదంతో అణచివేస్తామని కేటీఆర్ హెచ్చరించారు. శాంతిభద్రత పరిరక్షణలో కఠినంగా వ్యవహరిస్తున్నామని అన్నారు. మేం ప్రొగ్రెసివ్ రాజకీయాలు చేస్తామని ఆయన అన్నారు. మతం, కులం పేరుతో రాజకీయం చేసే వారిని ఓ కంట కనిపెట్టాలని సూచించారు. విధ్వంసకర శక్తులను ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టేది లేదని ఆయన అన్నారు. ఓల్డ్ సిటీని కూడా కొత్త సిటీతో సమానంగా డెవలప్ చేస్తాం అని ఆయన అన్నారు.