ప్రతిభ ఉంటే మంచి నటులు వస్తారు
వారసత్వం ఉంటే కాదు అని ఎన్నో సార్లు నిరూపించారు
ఆ విధంగా ఓ పెద్ద నటుడి ఇంటి బిడ్డ అయినా కూడా
ఓ అయిష్టంతోనే అడుగులు వేసినా కూడా
తనని తాను నిరూపించుకునే క్రమాన్నే ఇష్టపడతారు
దుల్కర్.. మణి సర్ సినిమాలో నటించారు.. ఓకే బంగారం అనిపించుకున్నారు. ఇష్టం అయిన దర్శకుడు రాజమౌళి నుంచి ఒక్క పిలుపు వస్తే చాలు సినిమా చేసేందుకు సిద్ధమేనని కూడా అంటున్నారు. ఇప్పుడయితే ఆయన స్టార్.. కానీ ఒకప్పుడు అందరికీ తెలియని స్టార్ కొడుకు.. తనకు మాత్రమే తెలిసిన స్టార్ కొడుకు.. వాటి వల్ల ఏం లాభం లేదు అని గుర్తించిన బాధ్యత ఉన్న కొడుకు కూడా ఇప్పుడు. దటీజ్ దుల్కర్..
మూవీ మేకింగ్ అంటే దుల్కర్ కు ఇష్టం.. ఆయన పూర్తి పేరు దుల్కర్ సల్మన్.. కొద్దిపాటి సినిమాలు చేసి మంచి పేరు సాధించేందుకు అర్హత పొందాడు. ఆ విధంగా ఆయన ఓ గొప్ప నటుడి కొడుకుగా కాకుండా సాదాసీదా జీవితమే తాను గడిపానని అంటారు. చదువు తరువాత కార్లను నడపడం, వాటిని రీ డిజైన్ చేయడం ఆయనకు ఇష్టాలు. కనుక ఆయన ఇష్టాలలో భాగంగా ఇప్పుడు ఖరీదయిన కార్లు వచ్చి చేరుతున్నాయి. కానీ ఒకప్పుడు ఇవేవీ లేవు కాదు తెలియవు కూడా ఆయనకు !
మహానటి సినిమా లేకపోతే దుల్కర్ లేడు అని అనుకోలేం. మహానటి లేకపోయినా దుల్కర్ ఉంటాడు కానీ జెమినీ గణేశన్ అనే ఓ పాత్ర లేకపోతే, ఓ నటుడు లేకపోతే నిజంగానే మనకు దుల్కర్ లో మంచి నటుడు పరిచయం కాకుండా ఉండేవాడు.ఆ రోజు చెన్నయ్ లో అతి సామాన్యంగా గడిపిన రోజుల నుంచి ఓ గొప్ప నటి జీవితాన్ని అత్యంత ప్రభావితం చేసిన వ్యక్తి పాత్రను పోషించే వరకూ దుల్కర్ కొన్ని ఒడిదొడుకులు చూశారు. అవి లేకపోతే నాన్న నుంచి ప్రశంసలు కాదు కదా కనీసం ఆయన ప్రోత్సాహం కూడా దక్కి ఉండేదే కాదని భావిస్తున్నారు. మమ్ముట్టి పేరు వింటే మలయాళం సూపర్ స్టార్ అని గుర్తు పట్టడం సులువు.
నాన్న పేరు నిలబెట్టడంతో ఇప్పుడు దుల్కర్ కూడా మరో సూపర్ స్టార్ గా ఎదిగేందుకు అవకాశాలు సులువు అయ్యాయి. మార్గం సుగమం అయింది అని రాయాలి. ఆ విధంగా దుల్కర్ సల్మన్ అటు మలయాళ సీమనే కాదు ఇటు తెలుగు చిత్ర సీమనూ హాయిగా ఆకట్టుకుంటూ మంచి సినిమాలకు కేరాఫ్ అని నిరూపించుకుంటున్నాడు. అందుకే దుల్కర్ ఒక నాటి జీవితాన్ని తల్చుకుంటూ తన లైఫ్ లో వచ్చిన కొద్ది పాటి మార్పులు చూసి ఆశ్చర్యపోతాడు.
ఆ విధంగా నాన్నకు అదే విధంగా అమ్మకు మంచి పేరు తీసుకుని రావడంతో ఇప్పుడాయన మరో కొత్త ప్రయాణంలో ఉన్నారు. ప్రతిభను ప్రోత్సహించే క్రమంలో ఆయన నిర్మాతగా మారి, వినూత్న రీతిలో నడిచే కథలకు మాత్రమే మొగ్గు చూపుతున్నారు. తన ఆసక్తి, ప్రేక్షకుల అభిరుచి ఈ రెండూ కలగలిసేలా జాగ్రత్తలు వహిస్తూ కొత్త సినిమాల రూపకర్తగా మారనున్నారు.